లిక్కర్​ షార్టేజీ.. ఉత్పత్తి ఆపేసిన డిస్టలరీలు

లిక్కర్​ఫ్యాక్టరీలు, డిస్టిలరీలు చాలా రకాల బ్రాండ్​ల మద్యం,  బీర్ల ఉత్పత్తిని ఆపేశాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోవడంతో డిస్టిలరీలు చేతులెత్తేసినట్టు చెప్తున్నారు. రెండు నెలల నుంచి సరిపడా లిక్కర్​, బీర్లు మార్కెట్​లోకి రావడం లేదు. మార్కెట్​లో  డిమాండ్​ఉన్న  చీప్​ లిక్కర్​తో పాటు వివిధ  కం పెనీల  లిక్కర్​, బీర్లు దొరకడం లేదు.  బేవరేజెస్​కార్పొరేషన్​గోదాముల్లో ప్రస్తుతం రేషన్ విధించారు. 50 రోజుల నుంచి రాష్ట్రంలోని 19 బేవరేజెస్​ డిపోల్లో చీప్ లిక్కర్​ స్టాక్​ లేదు. లిక్కర్, బీర్ల కోసం మూడు, నాలుగు రోజుల దాక  వెయిట్​ చేయాల్సివస్తోంది. వైన్​షాపుల్లో  పది రకాల చీప్​ లిక్కర్​ బ్రాండ్లు వైన్స్ సేల్​అవుతుంటాయి. కానీ  షార్టేజ్​ వల్ల కేవలం మూడు రకాల బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. చీప్​ లిక్కర్​లో టాప్​ రేంజ్​లో ఉండే డౌన్​టౌన్​, గుడ్​ డే  బ్రాండ్లు సప్లై జరగడంలేదు.   మీడియం, ప్రీమియం బ్రాండ్స్​లో  కూడా  10 0 పైపర్స్​, బ్లెండర్​ స్పైడ్​, ఐబీ, రాయల్ స్టాగ్​ వంటి  బ్రాండ్​లే   దొరుకుతున్నాయి. మీడియం బ్రాండ్లు మార్కెట్లోకి రావడం బంద్​ అయ్యింది.    రూ.150లు పలికే బీర్లు స్టాక్​ లేవని చెపుతున్నారు. కమీషన్​ ఎక్కువగా వచ్చే స్ట్రాంగ్​ బీర్లను మాత్రమే ​ ఉత్పత్తి చేస్తున్నారని,  నార్మల్​ రేంజ్​లో  కింగ్​ఫిషర్​లైట్​ తప్ప  ఇతర    బ్రాండ్లు లిక్కర్​ డిప్లోల్లో స్టాక్​ లేవని చెప్తున్నారు. 

పేరుకు పోయిన బకాయిలు 

బీఆర్​ఎస్​ప్రభుత్వం కంపెనీలు సప్లై చేసిన మద్యానికి డబ్బులు  చెల్లించకపోవడంతో   బకాయిలు  పేరుకు పోయాయి.  డిస్టలరీలు,  బ్రూవరీస్​లకు ప్రభుత్వం ఇష్యూ ధర (ఉత్పత్తి ధర) ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం  కంపెనీలకు డబ్బులు ఇవ్వకుండా  లిక్కర్​ మీద వచ్చిన ఆదాయాన్నంతా ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంది. దీంతో  ఒక్కో కంపెనీనీకి సుమారు రూ.4,5 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడీ బకాయిలు చెల్లిస్తే తప్ప లిక్క ర్​, బీర్లు ఉత్పత్తి చేయమని కంపెనీలు చెప్తున్నాయి.  కమీషన్​ఎక్కువగా  వచ్చే బ్రాండ్లను మాత్రమే  కొంతవరకు  సప్లై చేస్తున్నాయేగానీ,  మార్కెట్​  అవసరాలకు  తగ్గట్టు సరుకు పంపడంలేదు.  దీంతో   రెండు నెలలుగా  పలు జిల్లాలో లిక్కర్​సేల్స్​భారీగా పడిపోయాయి. రాష్ట్రంలో లిక్కర్​సేల్స్ లో మొదటి స్థానంలో ఉండే   నల్గొండలో ఒక్క ఫిబ్రవరిలోనే రూ.2.54 కోట్ల అమ్మకాలు పడిపోయాయి.  నల్గొండ, హుజూర్​నగర్​, సూర్యాపేట  నియోజకవర్గాల్లో సేల్స్ బాగా తగ్గిపోయాయి.

పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రావట్లే..

గతంలో లిక్కర్​ కొరత వచ్చినప్పుడు కర్నాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు సప్లై జరిగేది. కానీ బకాయిలు చెల్లించకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి మందు సప్లై చేయడంలేదు.  దీనికి తోడు ఎన్నికల కోడ్​కూడా  సేల్స్​ పై  ప్రభావం చూపుతోంది. డబ్బు, బంగారం పైన ఆంక్షలు పెట్టినట్టుగానే లిక్కర్​ సేల్స్​ పైన కూడా ఎన్ని కల కమిషన్​ నిఘా పెట్టింది. ప్రతి రోజు లిక్కర్​ సేల్స్​ సమాచారం చెప్పాలని, ఎక్కడి నుంచైనా భారీగా లిక్కర్​ డంప్​ అయినట్టు తెలిస్తే వెంటనే తనిఖీలు చేయాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలువైపులా, అంతరాష్ట్ర సరిహద్దుల్లో  చెక్​ పోస్టులు ఏర్పాటు చేశారు.  ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​, ఎన్​ఫోర్స్​మెంట్​, స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​ బృందాలు నిఘా వేశాయి. మరోవైపు కరువు ప్రభావం కూడా లిక్కర్​ సే ల్స్​ పైన కనిపిస్తోంది.