
హైదరాబాద్: హోలీ పండుగ సందర్భంగా పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. గురువారం ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు జంట నగరాల పరధిలో మద్యం దుకాణాలు బంద్ మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలను నిషేధించారు.
హోలీ వేడుకలను పురస్కరించుకుని అపరిచితులు, వాహనాలపై, ఇతరుల భవనాలపై రంగులు వేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా జంట నగరాల పరిధిలో 2 రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడుతున్నాయనే విషయం తెలియడంతో నగరంలోని మద్యం దుకాణాల వద్ద రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. అనేక మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వికాస్ రాజ్
ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు