- రాత్రి పరిష్కరించిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అన్ని మద్యం డిపోల్లో లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. వైన్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రూపొందించిన సాప్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో సర్వర్ స్తంభించి రాష్ట్రం మొత్తం లిక్కర సప్లైకు బ్రేకులు పడ్డాయి.
దీంతో డీడీలు కట్టి డిపోలకు వెళ్లిన డీలర్లు సర్వర్ హ్యాంగ్ అయిందన్న సమాచారంతో మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయంలో అధికారులు సమస్యను పరిష్కరించారు. గురువారం ఉదయం నుంచి యథావిధిగా మద్యం డిపోల నుంచి లిక్కర్ సప్లై అవుతుందని తెలిపారు.