అర్ధరాత్రి వరకు మద్యం టెండర్లు

వెలుగు నెట్‌వర్క్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. టెండర్లకు చివరి రోజు కావడంతో ఆశావహులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆఫీస్‌ల ఎదుట క్యూ కట్టారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 60 షాపులు ఉండగా రాత్రి 10 గంటల వరకు 1,800 అప్లికేషన్లు వచ్చాయి.

అలాగే హనుమకొండ జిల్లాలో 65 షాపులకు 5,509, వరంగల్‌ జిల్లాలో 63 షాపులకు 2,805, జనగామలో 47 షాపులకు 2,355, మహబూబాబాద్‌లో 59 షాపులకు 1,572 అప్లికేషన్లు వచ్చాయి.