మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్‌కాలేజీ వద్ద బుధవారం సాయంత్రం కరీంనగర్-జగిత్యాల మెయిన్‌రోడ్డుపై లిక్కర్వ్యాన్ బోల్తా పడింది. కరీంనగర్ నుంచి కోరుట్ల వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడడంతో లిక్కర్ సీసాలు పగిలి రోడ్డుపై మద్యం పారింది.
రూ.30 లక్షల విలువైన లిక్కర్లో 60 శాతం మట్టిపాలైంది. వ్యాన్‌లో డ్రైవర్‌తో పాటు మరో నలుగురు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది క్లియర్ చేశారు.