1. పొట్టేల్ ::
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం ‘పొట్టేల్’. ఈ మూవీ రేపు శుక్రవారం (అక్టోబర్ 25న) థియేటర్లలో రిలీజ్ కానుంది.
1980 నాటి నేపథ్యంలో తెలంగాణలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా జీవితంలో చదువు ఎంత ముఖ్యమనే విషయాల్ని ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఇక హీరో యువచంద్ర తన కూతురిని ఎలాగైనా చదివించాలని కష్ట పడుతుంటాడు. ఈ క్రమంలో ప్రేమగా పెంచుకుంటున్న పొట్టేల్ తప్పిపోవడంతో అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
Also Read : అరుదైన గౌరవం దక్కించుకున్న రామ్ చరణ్
అలాగే మూడ నమ్మకాల కారణంగా తన కూతుర్ని బలివ్వడానికి సిద్దమైన ఆ ఊరి పెద్ద నుంచి తన కూతురిని ఎలా కాపాడుకోగలిగాడనేది కథ. టోటల్ గా మంచి గ్రిప్పింగ్ స్టోరీ, ఎలివేషన్స్, విజువల్స్, సౌండ్ ట్రాక్ తో పొట్టేల్ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే అలరిస్తోంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
2 'క'(KA) ::
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ నుంచి రిలీజైన కాన్సెప్ట్ టీజర్, ట్రైలర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
పీరియాడిక్ థ్రిల్లర్ మూవీగా వస్తోన్న 'క' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రాబోతోంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి. కాగా 'క' మూవీకి సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతోనే వీరిద్దరు డైరెక్టర్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు.
3. జీబ్రా::
కొత్త తరహా కాన్సెప్టులు, డిఫరెంట్ రోల్స్‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ (SatyaDev)..ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ప్రేక్షకుల ముందుకొస్తున్నది ‘జీబ్రా’(Zebra). లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్ లైన్. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనుంజయ్ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న జీబ్రా మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రాబోతోంది.
‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా,ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సునీల్,గరుడ రామచంద్రరాజు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్ పై బాల సుందరం, దినేష్ సుందరంలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ,కన్నడ మలయాళ, హిందీ భాషల్లో జీబ్రా విడుదల కానుంది.
4. లక్కీ భాస్కర్::
సార్ సినిమాతో ధనుష్ (Danush)కు సూపర్ హిట్ అందించిన దర్శకుడు వెంకీ అంట్లూరి(Venky Atluri) డైరెక్షన్లో వస్తోన్న మూవీ లక్కీ భాస్కర్ (Lucky Baskhar). సీతా రామమ్ (Sitha Ramam) సక్సెస్ తరువాత పాన్ ఇండియా లెవల్లో హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నుంచి వస్తోన్న డైరెక్ట్ తెలుగు మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. 1980ల కాలం నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
ఇక టీజర్, ట్రైలర్‌లో.. ఒక బ్యాంక్ ఉద్యోగిగా, మరోవైపు కుటుంబం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే ఫ్యామిలీ మ్యాన్‌గా దుల్కర్, అతను భార్యగా మీనాక్షి కనిపించారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు, అతని ఎలాంటి అడ్డదారులు తొక్కాడు.. దానివల్ల ఎలాంటి అవరోధాలను ఎదుర్కొన్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది.
5. అమరన్::
తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukund Varadharajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyaswami) తెరకెక్కించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ పై అంచనాలు పెంచేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
మేజర్ ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోని రాజ్‌పుత్ రెజిమెంట్ లోని అధికారి ఆయన. దేశం కోసం అమరుడైన తర్వాత అశోక చక్ర అవార్డుతో సత్కరించారు. అలాంటి అధికారి పాత్రలో శివకార్తికేయన్ నటిస్తు జీవించేసాడని ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇక అతని భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి కనిపిస్తోంది.
6. భగీర::
కేజీఎఫ్’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వీళ్లు ఏ ప్రాజెక్టు చేసినా వాటిపై అంచనాలు పెరుగుతున్నాయి.
ప్రశాంత్ నీల్ కథతో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ‘భగీర’(Bagheera) సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘ఉగ్రమ్’ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నాడు. సూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దాంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాను దీపావళి సందర్బంగా 2024 అక్టోబర్ 31న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ట్రైలర్ని బట్టి స్టోరీ చూస్తే.. "చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు.. పెరిగి పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీర' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే" స్టోరీలా అనిపిస్తుంది. రెండు డిఫరెంట్ గెటప్స్‌లో శ్రీమురళి కనిపించి ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ నీల్ స్టైల్‌లోనే యాక్షన్‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి.
7. బ్లడీ బెగ్గర్::
బిగ్ బాస్ తమిళ్ నుంచి బయటికి వచ్చాక వరుస హిట్లతో జోరుమీదున్న కెవిన్ రాజ్ చేస్తున్న మూవీ ‘బ్లడీ బెగ్గర్’(Bloody Beggar). కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నా, అడుక్కోవడానికి నాటకాలు ఆడే ముష్టివాడి పాత్రలో కెవిన్ నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ కూడా దీపావళికే విడుదల అవుతోంది.
8. 'బ్రదర్'::
నేనే అంబానీ (Nene Ambani), ఆల్ ఇన్ ఆల్ అజగు రాజా, ఓకే, ఓకే (OK OK) చిత్రాల ఫేమ్ ఎం రాజేష్ (M Rajesh) దర్శకత్వంలో జయం రవి 'బ్రదర్' (Brother) మూవీలో నటిస్తున్నాడు. ఇందులో జయం రవికి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. భూమిక, నటరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 31న తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
9. లగ్గం::
సాయిరోనక్, ప్రగ్యా నగ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'లగ్గం'. వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు అక్టోబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
రమేశ్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో ఈ మూవీని తీశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ కి స్పందన బాగానే వచ్చింది. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో గ్రామీణ కుటుంబాల్లో ఉండే ప్రేమానురాగాలు, సాఫ్ట్‌వేర్ సంబంధాలు, వ్యవసాయం, నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
'భూల్ భులయ్యా 3', 'సింగం ఎగైన్' అనే హిందీ మూవీస్ కూడా నవంబర్ 1న రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో హిట్ అయి 'దీపావళి' విన్నర్ ఏదవుతుందో చూడాలి?ఇ వి మరి దీపావళి రేసులో నిలిచిన సినిమాలు. చూడాలి మరి దసరాకు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ దీపావళికైనా కళకళలాడుతుందేమో!