ఐపీఎల్ అవార్డ్ విన్న‌ర్స్‌కు.. ఎంతెంత డ‌బ్బులు ఇచ్చారు

ఐపీఎల్ అవార్డ్ విన్న‌ర్స్‌కు.. ఎంతెంత డ‌బ్బులు ఇచ్చారు

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ పోరు అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను పంచింది. వర్షం కారణంగా మూడు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ చివరకు రిజర్వ్ డే రోజున ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోలేకపోయింది. ధోని సేన ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.

ఐపీఎల్ 2023 ప్రైజ్ మనీ వివరాలు

 

  • మొత్తం ప్రైజ్‌మనీ: రూ. 46 కోట్ల 50 లక్షలు 
  • విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు - రూ. 20 కోట్లు
  • రన్నరప్‌ గుజరాత్ టైటాన్స్ జట్టుకు - రూ. 13 కోట్లు
  • మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ కు - రూ. 7 కోట్లు
  • నాలుగో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ కు -  రూ. 6 కోట్ల 50 లక్షలు

ఐపీఎల్ 2023 అవార్డుల విజేతలు- క్యాష్ ప్రైజ్

  • ఫెయిర్‌ ప్లే అవార్డు: ఢిల్లీ క్యాపిటల్స్‌
  • ఆరెంజ్‌ క్యాప్‌: శుభ్‌మాన్‌ గిల్‌ (890 పరుగులు) ప్రైజ్‌మనీ: రూ.15 లక్షలు 
  • పర్పుల్‌ క్యాప్‌: మహమ్మద్‌ షమీ (28 వికెట్లు) ప్రైజ్‌మనీ: రూ.15 లక్షలు  
  • ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: యశస్వి జైశ్వాల్‌ (ఆర్ఆర్ - రూ.10 లక్షలు)
  • సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (ఆర్‌సీబీ - రూ.10 లక్షలు)
  • మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుభ్‌మాన్‌ గిల్‌ (గుజరాత్ - రూ.10 లక్షలు)
  • గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌: శుభ్‌మాన్‌ గిల్‌ (రూ.10 లక్షలు)
  • లాంగెస్ట్‌ సిక్స్‌ ఆఫ్‌ ది సీజన్‌: ఫాఫ్‌ డుప్లెసిస్‌ (ఆర్‌సీబీ - రూ.10 లక్షలు)
  • క్యాచ్‌ ఆఫ్‌ ది సీజన్‌: రషీద్‌ ఖాన్‌ (గుజరాత్ - రూ.10 లక్షలు)
  • అత్యధిక ఫోర్లు: శుభ్‌మాన్‌ గిల్‌ (రూ.10 లక్షలు)
  • బెస్ట్‌ పిచ్‌, గ్రౌండ్‌ ఆఫ్‌ ది సీజన్‌: ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడే స్టేడియం (రూ.50 లక్షలు)

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ అవార్డు విజేతలు

  • సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్: అజింక్యా రహానె (సీఎస్‌కే) - రూ.1 లక్ష
  • గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది మ్యాచ్: సాయి సుదర్శన్ (గుజరాత్) - రూ.1 లక్ష
  • మోస్ట్‌ వాల్యుబుల్‌ అసెట్ అఫ్ ది మ్యాచ్: సాయి సుదర్శన్ (గుజరాత్) - రూ.1 లక్ష
  • అత్యధిక ఫోర్లు: సాయి సుదర్శన్ (గుజరాత్) - రూ.1 లక్ష
  • లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ మ్యాచ్: సాయి సుదర్శన్ (గుజరాత్) - రూ.1 లక్ష
  • క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్: ఎంఎస్ ధోని (సిఎస్‌కే) - రూ.1 లక్ష
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: డెవాన్ కాన్వే (సీఎస్‌కే)- రూ. 1 లక్ష
  • ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: శుభ్‌మాన్‌ గిల్‌