భారత్ తో అమెరికాతో మ్యాచ్ అంటే మన బి జట్టుతో మనం మ్యాచ్ ఆడుకోవడమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పేరుకు అమెరికా జట్టయినా ఆ జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. సగానికి పైగా అమెరికా క్రికెట్ జట్టులో భారత ఆటగాళ్లు ఉండడం విశేషం. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు బుధవారం (జూన్ 12) ఆతిధ్య అమెరికా జట్టుతో ఢీ కొట్టనుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో అమెరికా జట్టులోని భారత ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. మోనాంక్ పటేల్ (కెప్టెన్)
ప్రస్తుతం అమెరికా జట్టు కెప్టెన్ వికెట్ కీపర్ బ్యాటర్ మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్‌లో మే 1, 1993లో జన్మించాడు. వ్యాపారం దృష్ట్యా అతని కుటుంబం USAకి వలస వచ్చింది. 2018 నుండి అమెరికా తరపున మోనాంక్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. గుజరాత్ తరపున U16, U18 క్రికెట్ ఆడాడు.
2. హర్మీత్ సింగ్
హర్మీత్ సింగ్ సెప్టెంబర్ 7, 1992న ముంబైలో జన్మించాడు. భారత దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బౌలింగ్ ఆల్ రౌండర్.. డొమెస్టిక్ క్రికెట్ లో ముంబై, త్రిపుర తరపున ఆడాడు. హర్మీత్ 2013 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మ్యాచ్ కూడా ఆడాడు. అంతేకాదు 2012 అండర్ 19 ప్రపంచ కప్ సమయంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2021లో USAకి వెళ్లి క్లబ్ క్రికెట్ ఆడిన హార్మీత్.. 2024లో USA జట్టులో చోటు సంపాదించాడు.
3. మిలింద్ కుమార్
టీ20 వరల్డ్ కప్ 2024లో అమెరికా జట్టులో మిలింద్ కుమార్ మరొక భారతీయ సంతతికి చెందిన ఆటగాడు. అతను 1991లో ఢిల్లీలో జన్మించాడు. ఢిల్లీ, సిక్కిం తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇక ఐపీఎల్ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మ్యాచ్ లు కూడా ఆడాడు. 2021లో భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి USAకి వెళ్లి అక్కడ జట్టులో స్థానం సంపాదించాడు.
4. జెస్సీ సింగ్
31 ఏళ్ల పేసర్ జెస్సీ సింగ్ 1993లో న్యూయార్క్‌లో జన్మించిన భారతీయ సంతతికి చెందిన క్రికెటర్. 2015లో USA తరపున అరంగేట్రం చేసాడు. అప్పటినుండి అమెరికా జట్టు తరపున ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతూ వస్తున్నాడు.
5. నిసార్గ్ పటేల్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన నిసార్గ్ పటేల్ స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్. 2018లో USA తరపున లిస్ట్ ఏ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2019లో అమెరికా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇప్పటి వరకు నిసార్గ్ తన కెరీర్‌లో 41 వన్డేలు, 20 టీ20
మ్యాచ్ లాడాడు.
6. నితీష్ కుమార్
నితీష్ కుమార్‌కు భారతీయ-కెనడియన్ సంతతికి చెందినవాడు. 1994 లో జన్మించిన అతను కెనడాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. కెనడా తరపున 2011 వరల్డ్ కప్ ఆడాడు. ఏప్రిల్ 2024లో USA తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. ప్రస్తుతం అమెరికా జట్టులో బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా జట్టులో కొనసాగుతున్నాడు.
7. నోస్తుషా ప్రదీప్ కెంజిగే
నోస్తుషా ప్రదీప్ కెంజిగే యునైటెడ్ స్టేట్స్‌లోని అలబామాలో చెందిన అతని తల్లి దండ్రలు బెంగళూరుకు చెందినవారు. 2015లో, అతను మళ్లీ USAకి వెళ్లి, ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసి, క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2018లో, అతను USA తరపున లిస్ట్ A క్రికెట్ ఆడే అవకాశాన్ని పొందాడు మరియు 2019లో అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. నోస్తుషా 40 వన్డేలు, 4 టీ20లు ఆడిన స్పిన్ ఆల్ రౌండర్.
7. నోస్తుషా ప్రదీప్ కేంజిగే
1991లో యునైటెడ్ స్టేట్స్‌లోని అలబామాలో భారతీయ కుటుంబంలో జన్మించారు. అతని కుటుంబం భారతదేశంలోని బెంగళూరుకు తిరిగి వెళ్లింది. 2015లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసి, క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 2018లో USA తరపున లిస్ట్ ఏ క్రికెట్ ఆడి 2019 లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం అమెరికా జట్టులో ప్రధాన స్పిన్నర్ గా జట్టులో ఉన్నాడు.
8. సౌరభ్ నేత్రవల్కర్
సౌరభ్ నేత్రవల్కర్ భారత సంతతికి చెందిన USA క్రికెటర్. అతని జన్మస్థలం ముంబై. 2010 లో జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడాడు. అప్పడు భారత జట్టులో కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ అగర్వాల్‌లు లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇదే టోర్నీలో పాకిస్థాన్ పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సౌరభ్ నేత్రవల్కర్ భారత దేశీయ క్రికెట్ లో ముంబై జట్టులో రెగ్యులర్ సభ్యుడు. 2013-14 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న ముంబై జట్టులో సౌరభ్ ఉన్నాడు.