ఏపీ లోక్​సభ, అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్

  •     మూడు ఎంపీ, 11 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఖరారు

న్యూఢిల్లీ, వెలుగు :  ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో మూడు లోక్ సభ, 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసీసీ రిలీజ్ చేసింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ బుధవారం లిస్ట్ విడుదల చేశారు. కాగా, ఏపీలో మొత్తం 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గతంలో 142 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా 11 స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేసింది. 25 లోక్ సభ స్థానాలకు 20 సీట్లకు అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయగా.. తాజా మరో 3 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. దీంతో ఫైనల్ అయిన అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య 153, లోక్ సభ అభ్యర్థుల సంఖ్య 23కు చేరింది. మరోవైపు పొత్తులో భాగంగా అరకు లోక్ సభ స్థానం, 8 అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కేటాయించారు. దీంతో మిగిలిన ఒక లోక్ సభ, 14 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 25తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.