మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఏపీలో సంచలనంగా మారింది. 2024 ఎన్నికల అల్లర్ల నేపథ్యంలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మీద ఉన్న పిన్నెల్లి బెయిల్ పిటిషన్లను జూన్ 26న ( బుధవారం ) హైకోర్టు కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు అనంతరం పోలీసులు పిన్నేల్లిని అరెస్ట్ చేశారు.నరసరావుపేటలో మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉండగా పిన్నెల్లిని అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీసుకు తరలించారు పోలీసులు.
ఎన్నికల అనంతరం నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో నమోదైన కేసుల్లో పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ను గతంలో పొడిగించింది హైకోర్టు. తదుపరి విచారణ వరకు పినెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది కోర్టు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ( బుధవారం ) విచారణ జరిపిన కోర్టు గతంలో పొడిగించిన బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
పిన్నెళ్లిపై ఉన్న కేసులు ఇవే:
- పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం కేసు
- సీఐపై దాడి
- టీడీపీ ఏజెంట్స్ పై దాడి
- మహిళలను దూషించిన కేసు