12 మంది ప్లేయర్స్ ను రిలీజ్ చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.. రిటైన్ ప్లేయర్ల లిస్ట్ ఇదే

ఐపీఎల్ 2024లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 12 మంది ప్లేయర్లను వదిలేసుకుంది. వీరిలో బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ తో పాటు సౌథీ, శార్దూలు ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గుసన్ లాంటి స్టార్ ప్లేయర్లున్నారు. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో మొత్తం 13 మంది ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా స్టార్ ఆల్ రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ మీద నమ్మకముంచారు.  మొత్తం 25 ప్లేయర్ల లిస్టులో 13 మందిని మాత్రమే తమ వద్ద అంటిపెట్టుకొని ఏకంగా 12 మందిని వదులుకోవడం విశేషం.

కేకేఆర్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్:

షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, డేవిడ్ వీస్, ఆర్య దేశాయ్, ఎన్ జగదీసన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, జాన్సన్ చార్లెస్.

కేకేఆర్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్:

నితీష్ రాణా, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, రహ్మానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, జాసన్ రాయ్. సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.