ఒకప్పుడు నీళ్లు బంద్.. కరెంట్ బంద్.. బస్సులు బంద్.. రైళ్ల బంద్ వార్తలు వచ్చేవి.. ఇప్పుడు జనం అభిరుచుల్లో బాగా మార్పులు వచ్చేశాయి.. అందుకే మందు బంద్ రోజులు అనేది బాగా హైలెట్ అవుతుంది. ఏం చేస్తాం.. మంచినీళ్లు మాదిరిగా మందు ప్రియుల సంఖ్య పెరగటమే దీనికి కారణం.. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2024, జూలై నెలలో.. అంటే ఈ నెలలో రెండు రోజులు బంద్ బంద్ కానుంది..
జూలై 17వ తేదీ మొహరం.. జూలై 21వ తేదీన బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే రానుంది. ఈ రెండు రోజులు లిక్కర్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. జూలై నెలలో ఈ రెండు రోజుల్లో మందు ప్రియులు.. ముందుగా స్టాక్ పెట్టుకుంటే బెటర్.