Champions Trophy 2025: మనకి కలిసొచ్చిన అంపైర్.. ఫైనల్ మ్యాచ్‌కు అఫీషియల్స్‌‌ వీరే!

Champions Trophy 2025: మనకి కలిసొచ్చిన అంపైర్.. ఫైనల్ మ్యాచ్‌కు అఫీషియల్స్‌‌ వీరే!

18 రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ వస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. 8 జట్లు తలపడిన ఈ టోర్నీలో ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆదివారం (మార్చి 9) దుబాయ్ వేదికగా ఈ బ్లాక్ బస్టర్ ఫైనల్ జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌–18, జియో హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌ ప్రసారమవుతుంది.    

భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 25 ఏళ్ళ తర్వాత మరోసారి రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయి. ఫైనల్లో గెలిచి కివీస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇండియాపై ఉన్న అద్భుతమైన ఐసీసీ రికార్డ్ న్యూజిలాండ్ కు ఊరట కలిగిస్తుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఐసీసీ మ్యాచ్ అధికారులను ప్రకటించింది. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు మ్యాచ్ అధికారుల జాబితా

ఆన్-ఫీల్డ్ అంపైర్లు: పాల్ రీఫెల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్

మూడవ అంపైర్: జోయెల్ విల్సన్

నాల్గవ అంపైర్ : కుమార్ ధర్మసేన

మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లె
          
రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ భారత్ కు కలిసొచ్చిన అంపైర్. అతను ఆన్ ఫీల్డ్ అంపైర్ గా 2024 టీ20 వరల్డ్ కప్ లో చేయగా ఇండియా ఫైనల్లో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. 2023  వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అంపైర్ గా చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. నాలుగుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ కు అంపైర్ గా వ్యవహరించారు. ఈ మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టీమిండియాకు అన్ లక్కీ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఈ మ్యాచ్ కు లేకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.