సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఆక్షన్ ప్రారంభం నుండి చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజ్‌లు హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఫ్రాంచైజ్‌ల మధ్య కాంపిటీషన్ విపరీతంగా నెలకొనడంతో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజ్‌లు పోటీ పడి మరీ కోట్లు కుమ్మరించాయి.
ఈ క్రమంలోనే ఫస్ట్ డే మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అచితూచీ వ్యవహరించింది. వ్యూహత్మకంగా వ్యవహరించి సెలక్టివ్‌గా ప్లేయర్లను కొనుగోలు చేసింది. తొలి రోజు వేలంలో ఎస్ఆర్హెచ్ మొత్తం ఏడుగురు ప్లేయర్లను దక్కించుకుంది. మొత్తం ఏడుగురు ప్లేయర్లలో ముగ్గురు బ్యాటర్లు.. ముగ్గురు బౌలర్ల, ఒక వికెట్ కీపర్‌ను కొనుగోలు చేసింది. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను అత్యధికంగా రూ.11.25 కోట్లకు దక్కించుకుంది. భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.
తొలి రోజు SRH కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
1. మహ్మద్ షమీ .. రూ.10 కోట్లు (బౌలర్)
2. ఇషాన్ కిషన్.. రూ.11.25 కోట్లు (బ్యాటర్& కీపర్)
3. హర్షల్ పటేల్.. రూ.8 కోట్లు (బౌలర్)
4. అభినవ్ మనోహర్.. రూ.3.2 కోట్లు (బ్యాటర్)
5. ఆడమ్ జంపా.. రూ.2.4 కోట్లు (స్పిన్నర్, ఆస్ట్రేలియా)
6. రాహుల్ చాహర్.. 3.2 కోట్లు (స్పిన్నర్)
7. అథర్వ తైదే.. రూ.30 లక్షలు (బ్యాటర్)