మూడో ప్రపంచ యుద్ధం వస్తే.. భూమిపై 10 సురక్షితమైన దేశాలు ఇవే.. అక్కడికి వెళితే బతకొచ్చు..!

ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడితో మూడో ప్రపంచ యుద్ధం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పటికే హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై మిడిల్ ఈస్ట్ ఇప్పటికే అట్టుడికిపోతోంది. మిడిల్ ఈస్ట్ తో ఉద్రిక్త పరిస్థితులు కాస్త తీవ్ర రూపం దాల్చిప్రపంచ మొత్తం పాకి..ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే.. ఈ సందర్భంలో ప్రపంచంలో ఏదీ సెఫెస్ట్ ప్లేస్ అని ఆసక్తి నెలకొంది. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన 10 ప్రాంతాలపై ఒకసారి లుక్కేద్దాం.. 

ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయెల్ పై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధానికి వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై ఇప్పటికే మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతోంది. ఇరాన్ దాడితో ఈ సంఘర్షణ తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ వంటి పొరుగు దేశాలు కూడా ఇజ్రాయెల్ పై దాడులు ప్రారంభించాయి. అయితే ఇరాన్ డ్రోన్ లను కూల్చివేయడానికి యునైటెడ్ స్టేట్స్ , యూకెలు ఇజ్రాయెల్ కు రక్షణగా ఉన్నాయి. 

మరోవైపు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ భద్రతా మండలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ దాడితో పెద్ద వివాదం నెలకొనబోతుందని చెప్పారు. 
అటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్ వివాదం కాస్త ముదిరి ప్రపంచ యుద్దానికి దారితీస్తే ఏ దేశాలు సురక్షితంగా ఉంటాయనే దానిపై ఆసక్తి కర చర్చ సాగుతోంది. అలాంటి దేశాలు గురించి తెలుసుకుందాం.. 

also read : మూడో ప్రపంచయుద్ధం మొదలైందా..?: జ్యోతిష్యురాలు బాబా వంగా ఏం చెప్పారు..

  • గ్రీన్ ల్యాండ్: డెన్మార్క్ లోని స్వయం పతిపత్తి కలిగిన దేశం.. ఇది రాజకీయాలకు  చాలా దూరంగా ఉంటుంది. ఫలితంగా సంఘర్షణ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ 
  • దక్షిణాఫ్రికా: స్థిరమైన విదేశాంగ విధానం కలిగిన ప్రపంచంలోని సురక్షిత ప్రాంతం. మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా జీవించొచ్చు. 
  • ఐస్ ల్యాండ్: సమృద్ధిగా మంచినీటి నిల్వలు, సముద్ర వనరులు, పునరుత్పాదక ఇంధన వనరులు కలిగిన ప్రదేశం. ఇది సురక్షితమైన ప్రాంతం. 
  • అంటార్కిటికా: అంటార్కిటికా కూడా యుద్దం బారిన పడే అవకాశం లేదు. ఇది వార్ జోన్ లోకి రాదు. కాబట్టి ఇది సురక్షితమైన ప్రాంతం. 
  • స్విట్జర్లాండ్: ఇది యుద్ధాలకు పోకుండా తటస్థంగా ఉంటే దేశం.. ఎక్కువగా ఇక్కడ పర్వత భూభాగం ఉంటుంది. ఇక్కడి సాంప్రదాయాలు తటస్థంగా ఉంటాయి. 
  • ఇండోనేషియా : బలమైన ఆర్థిక వ్యవస్థ, క్రియా శీల విదేశాంగ విధానం కలిగి ఉన్న దేశం. భౌగోళికంగా ఐసోలేషన్ ప్రాంతం. కాబట్టి ఇది కూడా ప్రపంచంలో సురక్షిత మైన ప్రాంతం. 
  • తువాలు: ఈ దేశానికి రాజకీయ జోక్యం ఉండదు. ప్రపంచ దేశాల్లో తటస్థంగా ఉంటుంది. ఐసోలేటెడ్ కంట్రీ. 
  • న్యూజీలాండ్: యుద్ధ వివాదాల చరిత్ర లేని ప్రజాస్వామ్య దేశం. సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న దేశం. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇది కూడా సురక్షితమైన ప్రాంతమే.
  • ఐర్లాండ్: శాంతియుత విదేశాంగ విధానం కలిగిన దేశం.. ఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటుంది.. సో ఇది సెఫెస్ట్ ప్లేస్.. 
  • భూటాన్: ఈ దేశాన్ని హిమాలయాలు రక్షిస్తాయి.భూటాన్ ప్రత్యేక ప్రదేశం..  అద్భుతమైన ఆశ్రయాన్ని అందిస్తుంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇది సురక్షితమైన ప్రాంతమే.