ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని ఉండాలని చెప్పడం.. దానికి కొనసాగింపుగా L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ 90 గంటల పనివేళలు ఉండాలనటం.. అంతేకాకుండా ఆదివారం పనిచేస్తే ఇంకా మంచిదని చెప్పడం వివాదాస్పమయ్యాయి. దీనిపై అదానీ, దీపికా పదుకొనే, ఆనంద్ మహీంద్ర లాంటి వారు సెటైర్లు వేయడం.. ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఇప్పుడు చర్చనీయమైన అంశాలు ఇవే.
నిజానికి భారత్ లో వారానికి ఎన్ని పనివేళలు ఉండాలనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. కొందరు ఎక్కువ వర్క్ చేయాలంటే.. కొందరు ఔట్ పుట్ బాగుండాలి.. గంటలతో పనిలేదు అంటున్నారు. ఈ సందర్భంగా.. అసలు ప్రపంచంలో 70 గంటల పని వేళలు.. లేదా అంతకంటే ఎక్కవ పని గంటలు ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయి..? మన ఇండియా ఎన్నో ప్లేస్ లో ఉందో తెలుసుకుందాం.
ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు:
1. భూటాన్:
తక్కువ జనాభా ఉన్నప్పటికీ భూటాన్ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ గంటలు పనిచేస్తు్న్నారు. వారానికి సరాసరిగా 54.4 గంటలు పనిచేస్తున్నారు.
2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ):
యూఏఈ ఉద్యోగులు వారానికి 50.9 గంటలు పనిచేస్తున్నారు.
3.లెసెతో:
సౌత్ ఆఫ్రికాలోని లెసెతో ప్రజలు వారానికి 50.4 గంటలు పనిచేస్తున్నారు.
4. కాంగో:
కాంగోలో 48.6 గంటలు పని చేస్తున్నారు.
5. ఖతార్:
ఖతార్ లో ఉద్యోగులు వారానికి యావరేజ్ గా 48 గంటలు పనిచేస్తున్నారు.
ఇండియా:
ఎక్కువ పనిచేసే దేశాలలో ఇండియా వారానికి పని గంటలలో ప్రపంచ వ్యాప్తంగా 13వ స్థానంలో ఉంది. భారతీయులు యావరేజ్ గా 46.7 గంటలు పనిచేస్తున్నారు. అయితే 51శాతం జనాభా 49 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారట.
ప్రపంచంలో అతి తక్కువ పని గంటలు ఈ దేశాలలోనే:
ఇక అతి తక్కువ గంటలు పనిచేసే దేశాలల లిస్టులో ఆస్ట్రేలియా ఖండంలోని వనౌతు దేశం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ దేశంలో కేవలం 24.7 గంటలు మాత్రమే పనిచేస్తారు. కిరిబతి (27.3), మిక్రోనేషియా(30.4) దేశాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.