- ఉమ్మడి జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం
- కరీంనగర్ జిల్లాలో 5,27,237, రాజన్న జిల్లాలో 3,46,259, జగిత్యాలలో 5,93,540,
- పెద్దపల్లి జిల్లాలో 4,07,716 మంది ఓటర్లు
- అత్యధికంగా మానకొండూరు మండలంలో 56,181 మంది
- అత్యల్పంగా వీర్నపల్లి మండలంలో11,549 మంది
- జీపీల్లో బొమ్మకల్ గ్రామంలో అత్యధికంగా 12,405 మంది ఓటర్లు
కరీంనగర్, వెలుగు: గ్రామ పంచాయతీల ఓటర్ల లిస్ట్ ఫైనల్ అయింది. ఈ మేరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో అత్యధికంగా 56,181 మంది ఓటర్లు ఉండగా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో అత్యల్పంగా 11,549 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ జీపీలో అత్యధికంగా 12,405 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలో 207 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాగా పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
కరీంనగర్ జిల్లాలో 5,27,237 ఓట్లు
ఫైనల్ లిస్టు ప్రకారం కరీంనగర్ జిల్లా 15 మండలాల పరిధిలోని 320 గ్రామాల్లో గల 3 వేల వార్డుల్లో కలిపి మొత్తం 5,27,237 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 2,69,894 మంది, పురుషులు 2,57,333 మంది ఓటర్లు ఉన్నారు. సిటీకి సమీపంలోని బొమ్మకల్ జీపీలో అత్యధికంగా 12,405 ఓట్లు ఉండగా, కొత్తపల్లి మండలం చింతకుంటలో 8,100, మానకొండూరులో 7,083 ఓట్లు, కొతపల్లి మండలం ఆసిఫ్ నగర్ జీపీలో 5,056 ఓట్లు, కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో 4,933 ఓట్లు ఉన్నాయి.
జిల్లాలో 300 ఓట్లులోపు ఉన్న చిన్న పంచాయతీలు 9 ఉన్నాయి. గన్నేరువరం మండలం సాంబయ్యపల్లిలో 207 ఓట్లు, యశ్వాడలో 231 ఓట్లు, తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో 209 ఓట్లు, శంకరపట్నం మండలం నల్ల వంకాయపల్లిలో 235 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మండలాల వారీగా మానకొండూరులో 56,181, గంగాధర 43,617, వీణవంక 42,310, రామడుగు 40,496, కరీంనగర్ రూరల్ 40,167, తిమ్మాపూర్ 37,715, శంకరపట్నం 35,042, హుజూరాబాద్ 34,627, చిగురుమామిడి 33,632, వి.సైదాపూర్ 32,243, కొత్తపల్లి 29,318, చొప్పదండి 29,262, జమ్మికుంట 28,396, ఇల్లందకుంట 26,188, గన్నేరువరం 18,043 మంది ఓటర్లు ఉన్నారు.
రాజన్న జిల్లాలో 3,46,259 ఓట్లు
రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాలు ఉండగా అందులోని 255 జీపీలకు సంబంధించి వార్డుల వారీగా ఓటరు జాబితాను ఆయా జీపీలలో గోడలకు అతికించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొత్తం 3,46,259 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు1,67,686 మంది ఓటర్లు, స్త్రీలు 1,78,553 ఉన్నారు. అత్యధికంగా ఎల్లారెడ్డిపేట మండలంలో 40,282 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా వీర్నపల్లి 11,549 మంది ఉన్నారు. మండలాల వారీగా బోయినిపల్లి మండలంలో 30,276, చందుర్తిలో 27,614, ఇల్లంతకుంటలో 39,903, గంభీరావుపేటలో 36,183, కోనరావుపేటలో 34,461, ముస్తాబాద్‌లో 38,142, రుద్రంగిలో 13,243, తంగళ్లపల్లిలో 37,804, వీర్నపల్లిలో 11,549, వేములవాడలో18,189, వేములవాడ రూరల్‌లో 18,613, ఎల్లారెడ్డిపేటలో 40,282 మంది ఓటర్లు ఉన్నారు.
జగిత్యాల జిల్లాలో 5,93,540 మంది ఓటర్లు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో 18 మండలాల పరిధిలోని 382 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 3,512 వార్డుల పరిధిలో మొత్తం 5,93,540 ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 2,83,010 మంది పురుష ఓటర్లుండగా, మహిళల ఓటర్లు 3,10,522 మంది ఉన్నారు.
పెద్దపల్లి జిల్లాలో 4,07,716 మంది ఓటర్లు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా 4,07,716 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 2,01,006 కాగా మహిళా ఓటర్లు 2,06,697 ఉన్నారు. అంతర్గాం మండలంలో 20,188, ధర్మారంలో 42,791, ఎలిగేడులో18,316, జూలపల్లిలో 23,828, కమాన్‌పూర్‌లో 19,845, మంథనిలో 34,202, ముత్తారంలో 22,745, ఓదెలలో 35,112, పాలకుర్తిలో 31,175, పెద్దపల్లిలో 50, 870, రామగిరిలో 37,280, కాల్వ శ్రీరాంపూర్‌లో 34, 026, సుల్తానాబాద్‌లో 38,325 మంది ఓటర్లు ఉన్నారు.