
రావల్పిండి: లిటన్ దాస్ (138) సెంచరీ, మెహిదీ హసన్ మిరాజ్ (78) హాఫ్ సెంచరీతో సత్తా చాటి పాకిస్తాన్‌తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ తడబడి నిలబడింది. ఓ దశలో 26/6తో కష్టాల్లో నిలిచిన బంగ్లా ఈ ఇద్దరి పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 స్కోరు వద్ద ఆలౌటైంది. ఫలితంగా పాక్‌కు 12 రన్స్‌ఆధిక్యం మాత్రమే లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో మూడో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన బంగ్లాను పాక్ పేసర్ ఖుర్రమ్ షహ్‌జాద్(6/90) దెబ్బకొట్టాడు. లిటన్, మిరాజ్ ఏడో వికెట్‌కు 165 రన్స్‌జోడించి బంగ్లాను ఆదుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ మూడో రోజు చివరకు 9/2తో నిలిచింది.