సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్‌షిప్) నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పంజాబ్, హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. తాము సహజ జీవనం చేసేందుకు అనుమతినివ్వాలంటూ పరారైన ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామని.. త్వరలో పెళ్లి చేసుకుంటామని పిటిషన్ లో తెలిపారు. తాము కలిసి ఉండేందుకు అనుమతి నివ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు.
తార్న్ తరన్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల గుల్జా కుమారి, 22 ఏళ్ల గుర్విందర్ సింగ్ హర్యానా కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో వారు తాము కలిసి నివసిస్తున్నామని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలిపారు. గుల్జా కుమారి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్సించాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే లివ్ ఇన్ రిలేషన్‌షిప్ నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని జస్టిస్ హెచ్‌ఎస్ మదాన్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.