స్విగ్గిలో అవకాడో సలాడ్ ఆర్డర్ చేస్తే నత్త ప్రత్యక్షం... బిత్తరపోయిన మహిళ..

స్విగ్గిలో అవకాడో సలాడ్ ఆర్డర్ చేస్తే నత్త ప్రత్యక్షం... బిత్తరపోయిన మహిళ..

హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేస్తే నత్త రావడంతో షాక్ అయింది. గౌర్మెట్ ఏషియన్ వంటకాలకు ఫేమస్ అయిన "షోయు" అనే రెస్టారెంట్ నుంచి మహిళ స్విగ్గి లో అవకాడో ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసిన ఫ్రూట్ సలాడ్ అనుకున్న సమయానికే డెలివరీ అయ్యింది. 

కానీ తిందామని పార్సెల్ ఓపెన్ చేయగానే ఫ్రూట్ సలాడ్ లో బతికి ఉన్న నత్త ప్రత్యక్షమవడంతో మహిళ ఒక్కసారిగా ఖంగుతింది. వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఫిర్యాదు చేసింది. అలాగే ఫుడ్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించని షోయు రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALSO READ | Popcorn Day: ఫేవరేట్ స్నాక్ ఐటెం..గుర్తుంచుకుందాం ఇలా..

ఈమధ్య హైదరాబాద్ లోని రెస్టారెంట్స్ లో ఫుడ్ ఆర్డర్ చెయ్యాలంటే ప్రజలు భయపడుతన్నారు. దీనికి కారణం కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిభంధనలు పాటించకపోవడమే. అయితే కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై దాడులు జరుపుతూ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు కొందరు రెస్టారెంట్ యాజమాన్యం.