IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. స్వదేశంలో మొదట మూడు టీ20 ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి టీ20 బుధవారం (జనవరి 22) ప్రారంభం కానుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈడెన్ గార్డెన్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించేసాయి. భారత కాలమాన ప్రకారం మూడు టీ20 మ్యాచ్ లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. 

పటిష్టంగా రెండు జట్లు:

15 మందితో కూడిన భారత జట్టును సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. 2024 డిసెంబర్ లో సౌతాఫ్రికాతో  టీ20 సిరీస్ తర్వాత భారత్ ఆడుతున్న తొలి టీ20 సిరీస్ ఇదే. పటిష్టమైన ఇంగ్లాండ్ తో సిరీస్ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. 14 నెలల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఫాస్ట్ బౌలర్ షమీపైనే అందరి దృష్టి నెలకొంది. అతను ఏ మేరకు రాణిస్తాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. మరోవైపు బట్లర్ సారధ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. సిరీస్ గెలిచి భారత్ కు షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. 

Also Read:-సంచలన విజయం.. న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన నైజీరియన్లు..

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. వెబ్‌సైట్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. 

ఇండియా టీ20 స్క్వాడ్ :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

ఇంగ్లాండ్: 

జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్

భారత్ vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

జనవరి 22: తొలి టీ20 (కోల్ కతా)
జనవరి 25: రెండో టీ20 (చెన్నై)
జనవరి 28: మూడో టీ20 (రాజ్ కోట్)
జనవరి 31: నాలుగో టీ20 (పుణె)
ఫిబ్రవరి 2: ఐదో టీ20 (ముంబై)

వన్డే సిరీస్ షెడ్యూల్

ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్ పూర్)
ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్)
ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్)