WPL 2024: ఫైనల్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌ కోసం ముంబై, బెంగళూరు..లైవ్ స్ట్రీమింగ్, తుది జట్ల వివరాలు ఇవే

WPL 2024: ఫైనల్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌ కోసం ముంబై, బెంగళూరు..లైవ్ స్ట్రీమింగ్, తుది జట్ల వివరాలు ఇవే

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ కోసం 16 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో మూడు సార్లు ఫైనల్ కు వచ్చినా ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షాలాగే మిగిలింది. అయితే మెన్స్ సాధించలేని కప్ కోసం ఉమెన్స్ సాధించటానికి సిద్ధమయ్యారు. డబ్ల్యూపీఎల్‌‌‌‌ లో ప్లే ఆఫ్ కు చేరి ముంబై తో నాకౌట్ సమరానికి సిద్ధమైంది. నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాలని గట్టి పట్టుదలతో ఉంది. 

ఇరుజట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఆర్‌‌‌‌సీబీ గెలవడం ఆ జట్టుకు కాన్ఫిడెన్స్‌‌‌‌ పెంచే అంశం కాగా, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌ పరంగా రెండు జట్లు సమంగా ఉన్నా రికార్డుల పరంగా ముంబై ఆధిక్యంలో ఉంది. ఓవర్‌‌‌‌సీస్‌‌‌‌ ప్లేయర్లు ఫామ్‌‌‌‌లో ఉండటం ముంబైకి కలిసొచ్చే అంశం కాగా, ఆర్‌‌‌‌సీబీ ఎక్కువగా ఎలైస్‌‌‌‌ పెర్రీ మీద ఆధారపడటం బలహీన అంశం.

లైవ్ స్ట్రీమింగ్ ఇందులో చూడాలంటే..?

స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. మొబైల్స్ లో ఈ మ్యాచ్ ను జియో సినిమాలో ఫ్రీగా చూడొచ్చు. బెంగళూరులోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు టాస్, 7:30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుంది  
   
తుది జట్లు (అంచనా)

ముంబై: హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), హేలీ మాథ్యూస్‌‌‌‌, యాస్తికా భాటియా / సాజీవన్‌‌‌‌ సజన, సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌, అమెలియా కెర్‌‌‌‌, అమన్‌‌‌‌జోత్‌‌‌‌ కౌర్‌‌‌‌, పూజా వస్త్రాకర్‌‌‌‌, హుమైరా కాజీ, ప్రియాంకా బాలా, షాబ్నిమ్‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌, సైకా ఇషాక్‌‌‌‌.
 
బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌‌‌‌), సోఫియా మొలినుక్స్‌‌‌‌, ఎలైస్‌‌‌‌ పెర్రీ, సోఫీ డివైన్‌‌‌‌, రిచా ఘోష్‌‌‌‌, జార్జియా వారెహామ్‌‌‌‌, దిశా కసాట్‌‌‌‌, శ్రేయాంక పాటిల్‌‌‌‌, ఆషా శోభన, శ్రద్ధా పోకార్కర్‌‌‌‌, రేణుకా సింగ్‌‌‌‌.