
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. బుధవారం (ఫిబ్రవరి 19) గ్రాండ్ గా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యం ఇస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నీ జరగనుండడంతో ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా పాకిస్థాన్ బరిలోకి దిగుతుంది. ఆతిధ్య పాకిస్థాన్ తో పాటు, భారత్ జట్లు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్నాయి.
Also Read:-బంగ్లాతో తొలి పోరు.. హర్షిత్ రాణా ఔట్.. టీమిండియా తుది జట్టు ఇదే!
వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ఐసీసీ ఈవెంట్ ఇదే కావడం విశేషం.
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లన్నీ టీవీ ఛానెల్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. జియో హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్ లు లైవ్ చూడొచ్చు. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ లన్ని మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ వివరాలు:
గ్రూప్ ఎ - పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్
గ్రూప్ బి - దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్:
ఫిబ్రవరి 19, పాకిస్తాన్ v న్యూజిలాండ్, (కరాచీ, పాకిస్తాన్)
ఫిబ్రవరి 20, బంగ్లాదేశ్ v ఇండియా (దుబాయ్)
ఫిబ్రవరి 21, ఆఫ్ఘనిస్తాన్ v దక్షిణాఫ్రికా (కరాచీ, పాకిస్తాన్)
ఫిబ్రవరి 22, ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ (లాహోర్, పాకిస్తాన్)
ఫిబ్రవరి 23, పాకిస్తాన్ v ఇండియా (దుబాయ్)
ఫిబ్రవరి 24, బంగ్లాదేశ్ v న్యూజిలాండ్ (రావల్పిండి, పాకిస్తాన్)
ఫిబ్రవరి 25, ఆస్ట్రేలియా v దక్షిణాఫ్రికా (రావల్పిండి, పాకిస్తాన్)
ఫిబ్రవరి 26, ఆఫ్ఘనిస్తాన్ v ఇంగ్లాండ్ (లాహోర్, పాకిస్తాన్)
ఫిబ్రవరి 27, పాకిస్తాన్ v బంగ్లాదేశ్ (రావల్పిండి, పాకిస్తాన్)
ఫిబ్రవరి 28, ఆఫ్ఘనిస్తాన్ v ఆస్ట్రేలియా (లాహోర్, పాకిస్తాన్)
మార్చి 1, దక్షిణాఫ్రికా v ఇంగ్లాండ్ (కరాచీ, పాకిస్తాన్)
మార్చి 2, న్యూజిలాండ్ v ఇండియా (దుబాయ్)
మార్చి 4, సెమీ-ఫైనల్ 1, (దుబాయ్)
మార్చి 5, సెమీ-ఫైనల్ 2, (లాహోర్, పాకిస్తాన్)
మార్చి 9, ఫైనల్ (లాహోర్) (ఇండియా ఫైనల్ కు వస్తే దుబాయ్‌లో మ్యాచ్ జరుగుతుంది)
మార్చి 10, రిజర్వ్ డే