జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి 50 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ కేవలం 25 కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూకశ్మీర్, హర్యానా ఫలితాలు వస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా : ఫరూక్ అబ్దుల్లా
ఫలితాల సరళిపై బీజేపీ కీలక నేతల సమావేశం
హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో ప్రభావం చూపని ఆప్
హర్యానాలో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ విజయం
జమ్మూకాశ్మీర్లో బీజేపీ ఘోర పరాజయం..27 స్థానాల్లోనే ఆధిక్యం
52 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి..బొక్కబోర్ల పడ్డ పీడీపీ
హర్యానాలో ( మధ్యాహ్నం 1 వరకు కౌంటింగ్ వివరాలు)
కాంగ్రెస్ : 40.03 శాతం
బీజేపీ : 39.66 శాతం
ఐఎన్ఎల్డీ : 4.50 శాతం
ఇతరులు : 10.84 శాతం
జమ్మూకాశ్మీర్ ( మధ్యాహ్నం 1 వరకు కౌంటింగ్ వివరాలు)
బీజేపీ : 26.21 శాతం.
జేకేఎన్ : 23.26 శాతం
కాంగ్రెస్: 11.83 శాతం
పీడీపీ : 8.50 శాతం
ఇతరులు : 24.84 శాతం
- జమ్మూకాశ్మీర్ లో రెండు స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం
- మళ్లీ తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్, 11 రౌండ్ల తర్వాత 6 వేల ఓట్ల లీడ్
ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో సంబురాలు.. ట్రెండ్ మారిన తర్వాత.. బీజేపీ ఆఫీసుల్లో తీయని వేడుకలు.. రెండు గంటల్లో మారిపోయిన సీన్.. హర్యానా ఫలితాలు ఊహించలేదంటున్న కాంగ్రెస్.. బీజేపీలో సైతం ఇదే వాదన..
మహబూబూ ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ ఓటమి
ఓటమి అంగీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్
బషీర్ అహ్మద్ చేతిలో ఇల్తీజా ఓటమి
జమ్మూ కశ్మీర్ లో కూటమి ఆధిక్యం
- జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 41
- బీజేపీ - 26
- కాంగ్రెస్ -10
- జేకేపీడీపీ- 4
- జేపీసీ-2
- సీపీఐ- 1
- ఇతరులు 6
- హర్యానా
49 సీట్లలో బీజేపీ..35 సీట్లలో కాంగ్రెస్, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యం
మధ్యాహ్నం 12.30 గంటల వరకు లెక్కింపు అయిన ఓట్లలో
బీజేపీకి 39.06 శాతం.. కాంగ్రెస్ కు 40.08 శాతం ఓట్లు
ఎంపీ శశిథరూర్
- బీజేపీ ఆధిక్యంలో ఉండటం ఆశ్చర్యంగా ఉంది
- ర్యానాలో పూర్తి ఫలితం కోసం వేచి చూస్తాం
హర్యానా జులానాలో వెనుకంజలో వినేశ్ ఫోగట్
జమ్మూకశ్మీర్ లో పోటీ చేసిన రెండు స్థానాలు గాండ్ బాల్, బుద్గాంలో ఆధిక్యంలో ఓమర్ అబ్దుల్లా
హర్యానాలో మాజీ డిప్యూటీ సీఎం, JJP అభ్యర్థి దుష్యంత్ చౌతాలా వెనుకంజ
ఆధిక్యంలో హర్యానా మాజీ సీఎం భూపేందర్ హుడా
హర్యానాలో బీజేపీ లీడ్
బీజేపీ 47, కాంగ్రెస్ 36, ఐఎన్ ఎల్డీ 2, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యం
జమ్మూకాశ్మీర్
47 స్థానాల్లో ఇండియాకూటమి, బీజేపీ28 ,పీడీపీ 4, ఇతరులు 11
హర్యానాలో ఓట్ల శాతంలో కాంగ్రెస్ హవా
అక్టోబర్ 8 ఉదయం 11గంటల వరకు లెక్కించిన ఓట్లలో కాంగ్రెస్ కు భారీగా పడిన ఓట్లు
40.47 శాతం ఓట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ
11 లక్షల 29 వేల 816 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే..
బీజేపీకి మాత్రం 38.80 శాతం ఓట్ల శాతం..
10 లక్షల 74 వేల 809 ఓట్లతో వెనకబడింది..
ఆయా నియోజకవర్గాల్లో లీడింగ్ మాత్రం బీజేపీ ఉంది..
హర్యానా
అర్బన్ సెగ్మెంట్లలో సత్తా చాటుతున్న బీజేపీ
జాట్ ల్యాండ్ లోనూ కాంగ్రెస్ కు టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ
40 కి పైగా సీట్లలో బీజేపీ, 30కి పైగా సీట్లలో కాంగ్రెస్ అధిక్యం
ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తాం: భూపేందర్ హుడా
హర్యానాలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
పూర్తి ఫలితం మాకు అనుకూలంగా ఉంటుంది
ఇది హర్యానా ప్రజల విజయం
హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..
హర్యానాలో కాంగ్రెస్ 38,బీజేపీ 46, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యం
జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ కూటమి 49, బీజేపీ 22, పీడీపీ 2, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యం
జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి ముందంజ
జమ్మూకాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా వెనుకంజ
నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బుద్గామ్, గందర్‌బల్ రెండు నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నారు.
హర్యానాలో పోటాపోటీ కాంగ్రెస్, బీజేపీలు
హర్యానాలో పోటాపోటీ కాంగ్రెస్, బీజేపీలు
అంబాలా కాంట్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ అగ్రనేత అనిల్ విజ్ వెనుకంజ
ట్రెండ్స్ లో మొదట దూసుకెళ్లిన ఉన్న కాంగ్రెస్
తర్వాతి రౌండ్లలో మారుతున్న ఈక్వెషన్స్
మెజార్టీ దగ్గరలో రెండు పార్టీలు
కాంగ్రెస్ 52, బీజేపీ 16, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యం
2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ 24 స్థానాలు తగ్గి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది.
దూసుకెళ్తున్న కాంగ్రెస్ కూటమి
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ లో ఇండియా కూటమి దూసుకెళ్తోంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 50సీట్లకుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇక అధికార బీజేపీ పార్టీ కేవలం 15స్థానాల్లోనే లీడ్ లో ఉంది.ఇక జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అయ్యాయి. జమ్మూకశ్మీర్లోనూ ఎన్సీ, కాంగ్రెస్ కూటమి అత్యధికంగా 30కిపైగా స్థానాల్లో లీడ్ లో ఉండగా.. 26సెగ్మెంట్లలో అధిక్యంలో బీజేపీ నిలిచింది.
ఇక ముప్తీ మహమ్మద్ నేతృత్వంలోని పీడీపీ మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక హర్యానాలో మాజీ సీఎం భూపిందర్ హుడా, రెజ్లర్, వినేశ్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు. జమ్మూకశ్మీర్లో ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా గండేర్ బల్ స్థానంలో లీడింగ్ లో ఉన్నారు. ఇక ఫలితాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తుండటంతో ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సంబురాలు చేసుకుంటన్నారు పార్టీ శ్రేణులు.
- ఢిల్లీ కాంగ్రెస్ హెడ్ ఆఫీసులో స్వీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ముందంజ
కాంగ్రెస్ కూటమి 36, బీజేపీ 18, పీడీపీ 3, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యం
- లాడ్వాలో సీఎం నాయబ్ సింగ్ సైనీ ముందంజ
- హరియాణాలో జులానాలో కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ దినేష్ ఫోగట్ ముందంజ
- గందర్ బాల్, బుద్గాంలో ఓమర్ అబ్దుల్లా ముందంజ
మళ్లీ అధికారం మాదే:నాయబ్ సింగ్
హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు ఆరాష్ట్ర సీఎం నాయబ్ సింగ్ సైనీ. పదేళ్లుగా రాష్ట్రాన్ని బీజేపీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అంతా అవినీతి అక్రమాలేనని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్బంగా కురుక్షేత్రలోని శ్రీ దక్షిణ్ ముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత ఎన్నికల కౌంటింగ్ సెంటర్ కు దగ్గరకు చేరుకున్నారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజ
కాంగ్రెస్ 38,బీజేపీ 15,ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉంది . కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి18, బీజేపీ 22 , ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మొదలైన ఓట్ల లెక్కింపు
హర్యానా,జమ్మూకశ్మీర్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా రెండు రాష్ట్రాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. . హర్యానాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 464 మంది ఇండిపెండెంట్లు, 101 మహిళలు పోటీ చేస్తున్నారు. 67.90 శాతం ఓటింగ్ నమోదైంది.
కాంగ్రెస్ కే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు
ఇటీవల విడుదలైన ఎగ్జిట్‌పోల్ ఫలితాలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. అటు బీజేపీ నేతలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. వరుసగా మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా, జమ్మూ కాశ్మీర్‌లోనూ ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అన్ని జిల్లాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది.