IPL 2024: బ్రూక్ ఔట్.. రీప్లేస్ మెంట్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2024: బ్రూక్ ఔట్.. రీప్లేస్ మెంట్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఇంగ్లాండ్ యువ స్టార్ ఆటగాడిని ఐపీఎల్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే  వ్యక్తిగత కారణాల వలన బ్రూక్ ఐపీఎల్ మొత్తానికి తప్పుకోవాల్సి వచ్చింది. బ్రూక్ అమ్మమ్మ చనిపోడంతో అతను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్వయంగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. అతని స్థానంలో తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ రీప్లేస్ మెంట్ గా దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ లిజార్డ్ విలియమ్స్ ను ప్రకటించింది.    

29 ఏళ్ల లిజాద్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. వ్రేడెన్‌బర్గ్‌లో జన్మించిన అతను మార్చి 2022లో కింగ్స్‌మీడ్, డర్బన్‌లో బంగ్లాదేశ్‌తో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు మరియు ఇప్పటివరకు రెండు టెస్టులు మాత్రమే ఆడిన ఈ పేస్ బౌలర్.. జూలై 16, 2021న తొలిసారి వన్డేల్లో ఐర్లాండ్‌తో డెబ్యూ చేసాడు. దేశీయ లీగ్ లో అతను SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్,కేప్ కోబ్రాస్,బోలాండ్ జట్ల కోసం ఆడాడు. 

పదునైన పేస్, స్వింగ్ అతని బలం. అవసరమైతే బ్యాటర్లని తన స్లో బాల్స్ తో బోల్తా కొట్టించగలడు. విలియమ్స్ కి ఇదే తొలి ఐపీఎల్ సీజన్ కావడం విశేషం. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న విలియమ్స్ ఐపీఎల్ లో ఎంతవరకు సత్తా చాటుతాడో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపియల్స్ ఐపీఎల్ లో దారుణ ప్రదర్శన చేస్తుంది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఒక్క విజయాన్ని మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.