హాయిగా బీరు తాగుతున్నారా? ఎందుకైనా మంచిది బీరు కొన్నప్పడు సరిగా చూసి తాగండి..లేకపోతే అంతే సంగతులు. లేటెస్ట్ గా ఓ వ్యక్తి ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుందామని వైన్ షాపుకెళ్లి బీర్లు కొన్నాడు. ఇంట్లో కూర్చొని తాగుదామని బాటిల్ ఓపెన్ చేయబోయాడు. అంతే.. బీరుబాటిల్ లో ఉన్న బల్లిని చూసి మనోడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే వైన్ షాప్ కెళ్లి అడిగితే తమకేం తెల్వదని యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు . ఈ ఘటన వికారబాద్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ALSO READ | ఫుడ్ సేఫ్టీ అధికారుల హడావిడి... స్వీట్ షాపుల్లో తనిఖీలు
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కెరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అతని ఫ్రెండ్ అనంతయ్య ఇద్దరు కలిసి పార్టీ చేసుకుందామని దగ్గరలోని ఓ వైన్ షాపులో రూ.4వేలు విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి బాటిల్ ఓపెన్ చేద్దామని చూడగానే బడ్‌వైజర్ బీర్ బాటిల్‌లో ఏదో తేలియాడుతూ కనిపించింది. తీరా చూస్తే బీరు బాటిల్ లో ఉన్నది బల్లి. వెంటనే అతను బాటిల్ ను ఓపెన్ చేయకుండానే వైన్ షాప్ కెళ్లి యజమానిని నిలదీశాడు. అయితే మాకేం తెలుసు..మాకు కంపెనీ నుంచి అలానే వచ్చింది.. మేం ఏం చేయాలి.. అని యజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు . దీంతో లక్ష్మీ కాంతరెడ్డి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక వ్యక్తి బాటిల్‌ని షేక్ చేస్తూ, లోపల తేలుతున్న బల్లి అవశేషాలను చూపించాడు. ఇది కాస్త వైరల్ గా మారింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు మందు ప్రియులు మండిపడుతున్నారు. డబ్బులు పెట్టి కొంటే..ఇలా క్వాలిటీ లేని మద్యంను అమ్మి మా ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అని ప్రశ్నిస్తున్నారు.