L K Advani: ఆసుపత్రిలో చేరిన ఎల్‌కే అద్వానీ

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ మంగళవారం(ఆగష్టు 06) ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్లు. వృద్దాప్యంలో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కనుక ఆందోళన చెందాల్సిందేమీ లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన గత నెలలో కూడా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కూడా చికిత్స అందుకున్నారు.

అద్వానీ 2002 నుండి 2004 వరకు ఉప ప్రధానిగా, 1999 నుండి 2004 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు.