మాజీ క్రికెటర్లు తలపడే లెజెండ్స్ లీగ్ క్రికెట్(LLC 2023) మూడో ఎడిషన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మణిపాల్ టైగర్స్, అర్బన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. అర్బన్‌రైజర్స్, టైగర్స్ జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 జరగనుండగా.. జెయింట్స్, క్యాపిటల్స్ జట్లు ఎలిమినేటర్ పోరులో తలపడనున్నాయి.
మిచౌంగ్ తుఫాన్ అడ్డు
సోమవారం(డిసెంబర్ 4) విశాఖపట్నం వేదికగా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగాల్సివుండగా మిచౌంగ్ తుఫాన్ అడ్డు పడింది. వర్షం నిరవధికంగా కురవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దయ్యింది. దీంతో అర్బన్‌రైజర్స్, మణిపాల్ టైగర్స్ జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరాయి.
మణిపాల్ టైగర్స్‌తో తలపడనున్న హైదరాబాద్
మంగళవారం(డిసెంబర్ 5) అర్బన్‌రైజర్స్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. లాలాభాయ్ స్టేడియం(సూరత్) వేదికగా సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అర్బన్‌రైజర్స్ జట్టుకు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Qualifier 1 are here! ???
— Legends League Cricket (@llct20) December 5, 2023
Tigers and the Urbanrisers are ready to face off in a heavyweight battle! ??
Tigers or Urbanrisers? Who will make it to the final today? ??#LegendsLeagueCricket #LLCT20 #BossLogonKaGame pic.twitter.com/92w5eOeO79
Spreading smiles everywhere he goes. Our Turbanator is a true legend on and off the field! ??#LLCT20 #LegendsLeagueCricket #BossLogonKaGame@harbhajan_singh @manipal_tigers pic.twitter.com/Uz3DxjfIcp
— Legends League Cricket (@llct20) December 5, 2023