
కోహెడ, వెలుగు : నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ హామీల అమలులో విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని చెంచల్చేర్వుపల్లిలో ‘పల్లె పల్లెకు పవీణన్న.. గడప గడపకు కాంగ్రెస్’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో ఐదేండ్లలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తే, ఇప్పటి ఎమ్మెల్యే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బస్వరాజు శంకర్, ధర్మయ్య, సుధాకర్, మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, కిషన్, నారాయణ ఉన్నారు.