సిటీలో లాయిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సిటీలో లాయిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: యూకే ఫైనాన్షియల్ కంపెనీ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెక్నాలజీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించింది. ఈ కంపెనీకి యూకేలో 2 కోట్ల  డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. తమ డిజిటల్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మరింత మెరుగుపరచడానికి, కొత్త ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకురావడానికి లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ వచ్చే మూడేళ్లలో 3 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంటర్ పెడుతోంది. మొదటి దశలో 600 మంది హై స్కిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నియమించుకుంటామని  కంపెనీ పేర్కొంది.

డేటా, సైబర్ సెక్యూరిటీస్ వంటి జాబ్ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉద్యోగులను తీసుకుంటామని  వివరించింది. టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఎదుగుతోందనడానికి  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయబోయే తమ టెక్ సెంటర్ నిదర్శనమని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ కెమెనడే అన్నారు.  రెండు నెలల క్రితం లండన్ వెళ్లినప్పుడు లాయిడ్స్ గ్రూప్ ప్రతినిధులను కలిశానని ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ కేటీఆర్ పేర్కొన్నారు.