హైదరాబాద్, వెలుగు: యూకే కంపెనీ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్‌ను ఓపెన్ చేసింది. ఏఐ, క్లౌడ్, బ్లాక్ చెయిన్ వంటి కొత్త తరం టెక్నాలజీ సొల్యూషన్లను ఈ సెంటర్ అందిస్తుంది. మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీ ద్వారా యూకేలోని కస్టమర్లకు సర్వీస్‌లు అందిస్తుంది.
ఇందుకోసం 600 మంది ఫుల్ స్టాక్, జావా బ్యాక్ ఎండ్, రియాక్ట్, క్లౌడ్ ఇంజినీర్లను , క్వాలిటీ ఇంజినీర్లను లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ నియమించుకోనుంది.