SCOT vs NAM: 23 బంతులాడి డకౌట్.. నమీబియా బ్యాటర్ చెత్త రికార్డ్

నమీబియా బ్యాటర్ లాహండ్రే లౌరెన్సె వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. 23 బంతులాడిన ఈ యువ క్రికెటర్ ఖాతా తెరువకుండానే పెవిలియన్ కు చేరాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు ఎదర్కొని డకౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. స్కాట్లాండ్ పై 291 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నమీబియాకు లౌరెన్స్ ఆట విసుగు తెప్పించింది.

అతను మెక్ మూలాన్, షరీఫ్ ధాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. సహచర బ్యాటర్ వాన్ లింగేన్ బ్యాట్ ఝళిపిస్తున్నా..లౌరెన్సె మాత్రం పవర్ ప్లే లో ఒక్క పరుగు కోసం తీవ్రంగా శ్రమించాడు. చివరికి 23 బంతులాడి మెక్ మూలాన్ బౌలింగ్ లో షరీఫ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని ఔటయ్యే సరికి జట్టు స్కోర్ 6.5 ఓవర్లలో 27 పరుగులు.

ALSO READ | 2027 World Cup: అలా జరిగితే రోహిత్, కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారు: గంభీర్

శనివారం (జూలై 20) జరిగిన ఈ మ్యాచ్ లో నమీబియాపై స్కాట్లాండ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటిగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ మున్సీ 91 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే.. కెప్టెన్ బేరింగ్ టన్ 71 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో నమీబియా 235 పరుగులకు పరిమితమైంది.