లోన్ యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్నాడు.. లక్షా 20వేలు తిరిగి కట్టాడు.. అయినా సరే వదల్లేదు!

లోన్ యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్నాడు.. లక్షా 20వేలు తిరిగి కట్టాడు.. అయినా సరే వదల్లేదు!

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయం పేట మండలంలో లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (30) మండలంలో మిషన్ భగీరథలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతను లోన్ యాప్ లో సుమారు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. అందులో రూ.1.20 లక్షలు తిరిగి చెల్లించాడు. మిగిలిన డబ్బును సకాలంలో కట్టకపోవడంతో లోన్ యాప్ సిబ్బంది నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.

ALSO READ | ఎక్స్‌ఫైరీ వస్తువులు అమ్ముతున్న రిలయన్స్ సిబ్బంది.. కస్టమర్ల ఆందోళన

ఆ అవమానం భరించలేక యువకుడు మూడ్రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ యువకుడు మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.