రుణమాఫీ కాలే.. రైతు భరోసా రాలే

రుణమాఫీ కాలే.. రైతు భరోసా రాలే
  • గాంధీ భవన్ ఎదుట రైతు నిరసన

హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం చిత్తలూరుకు చెందిన తోట యాదగిరి అనే రైతు శుక్రవారం గాంధీ భవన్ ముందు నిరసనకు దిగాడు. తనకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని వాపోయాడు. గాంధీ భవన్ మెట్లపై కూర్చొని తన బాధను చెప్పుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు అతనికి నచ్చిజెప్పి పంపించి వేశారు.