రూ.2లక్షల రుణమాఫీ, భూమి లేని రైతులకు రూ.15 వేలు : రేవంత్

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారిని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు భద్రాచలంలోని శ్రీ సీతారాముల ఆలయాన్ని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రాక్షస పాలన అంతం చేస్తామని, రాముడి పాలనే తన లక్ష్యమని ట్వీట్ చేశారు. శ్రీరామ చంద్రుడి ఆశీర్వాదంతో జన శంఖారావమై వస్తున్నానని పేర్కొన్నారు.