11 నెలల్లో బ్యాంకులు ఇచ్చిన అప్పులు .. రూ.15.3 లక్షల కోట్లు.. పర్సనల్ లోన్ల వాటానే ఎక్కువ

11 నెలల్లో బ్యాంకులు ఇచ్చిన అప్పులు .. రూ.15.3 లక్షల కోట్లు.. పర్సనల్ లోన్ల వాటానే ఎక్కువ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 11 నెలల్లో బ్యాంకులు కొత్తగా రూ.15.3 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయి. దీంతో వీటి మొత్తం లోన్‌‌ బుక్‌‌ విలువ ఏడాది లెక్కన 9.3 శాతం పెరిగి రూ.175.56 లక్షల కోట్లకు చేరుకుంది.  కొత్తగా ఇచ్చిన అప్పులలో పర్సనల్ లోన్ల  వాటా 35.7 శాతంగా లేదా రూ.5.47 లక్షల కోట్లుగా  ఉంది. 

ఇందులో కూడా హోమ్‌‌ లోన్ల వాటానే  రూ. 2.6 లక్షల కోట్లుగా నమోదైంది. బ్యాంకులు పారిశ్రామిక రంగానికి రూ.2.22 లక్షల కోట్లను మంజూరు చేయగా,   సర్వీసెస్ సెక్టార్‌‌‌‌కు రూ.4.64 లక్షల కోట్లను  ఇచ్చాయి. వ్యవసాయ రుణాలు  రూ.1.93 లక్షల కోట్లుగా,    వాణిజ్య సంబంధిత రుణాలు రూ.1.32 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 

 బంగారు ఆభరణాలపై రుణాలు రూ.88,636 కోట్లకు  పెరిగాయి.  వాహన రుణాలు రూ.46,384 కోట్లుగా,  క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ.30,031 కోట్లుగా రికార్డయ్యాయి.