- నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి
వనపర్తి, వెలుగు : వనపర్తిలో త్వరలో జరిగే లోన్మేళాలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రైతులకు రూ.300 నుంచి రూ.400 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి కేజీబీవీలో కామన్ డైట్ నుపరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో నిరుద్యోగులు జాబ్‌మేళా, రైతులకు లోన్‌మేళా, స్కిల్ డెవలప్మెంట్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
మేళాకు 50 కంపెనీలు వస్తున్నాయని, పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో జరిగే మేళాలో వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారని 2 వేల మంది నిరుద్యోగులు హాజరవుతారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. నియోజవర్గంలోని కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో సమస్యలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు.
స్కూళ్లలో అన్ని సౌలతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహేశ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, పీసీసీ డెలిగేట్ శంకర్ ప్రసాద్, జీసీడీవో శుభలక్ష్మి, ఎంఈవో మద్దిలేటి పాల్గొన్నారు.