భిక్కనూరులో.. అసైన్డ్​ భూములకూ లోన్లు ఇవ్వాలి

భిక్కనూరు, వెలుగు :  పట్టా భూములున్న రైతులతో సమానంగా అసైన్డ్​భూముల రైతులకు కూడా అగ్రికల్చర్​ లోన్​లు అందించాలని బస్వాపూర్​ సింగిల్ ​విండో పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం విండో చైర్మన్​ లింగాల కిష్టాగౌడ్​అధ్యక్షతన విండో సమావేశం జరిగింది.

కిష్టాగౌడ్​ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్​పార్టీ రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్​స్వామి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.