సిగరేట్ మత్తులో ఎండ్రకాయ హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో

సిగరేట్ మత్తులో ఎండ్రకాయ హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో

సిగరేట్ మనుషులేనా తాగేదీ..మేం తాగకూడదా?..మేం కూడా స్టయిల్ గా తాగుతాం..మనుషులకు ఏమాత్రం తీసిపోం..ఎలా ఉంది నా స్టయిల్..అన్నట్లు ఉంది ఓ పీత ఫోజు.. ఎండ్రకాయ అలియాస్ పీత నీటి ప్రవాహం పక్కనే ఉంటూ..అక్కడ దొరికే వ్యర్థాలను తిని పొట్ట నింపుకుంటాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాటికున్న రక్షకాలతో అడ్డు కుంటాయి. అయితే ఈ ఎండ్రకాయ మాత్రం దాని రక్షకాలతో దర్జాగా సిగరెట్ పట్టుకొని దమ్ము కొడుతోంది. ఓ ఎండ్రకాయ ఏకంగా సిగరేట్ తాగే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియో ఎవరు తీసారో .. ఎప్పుడు తీసారో కాని సిగరేట్ కి మనిషులే కాదు పీతలు కూడా అడిక్ట్ అవుతాయ అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

సాధారణంగా ఎండ్రకాయలు పగుళ్లలో లేదా రాళ్ల కింద బొరియలలో కనిపిస్తాయి. సాధారణంగా వలస వెళ్లవు. పెద్ద, పాత ఎండ్రకాయలు లోతైన సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి, కాలాను గుణంగా లోతులేని నీటికి వలసపోతాయి. సర్వభక్షకులు. సాధారణంగా చేపలు, మొలస్క్‌లు, ఇతర క్రస్టేసియన్‌లు, పురుగులు,కొన్ని మొక్కల జీవితం వంటి ప్రత్యక్ష ఆహారాన్ని తింటాయి. 

అలాంటిది ఈ వీడియోలో కనిపించే ఎండ్రకాయకు ఎలా సిగరెట్ అలవాటయ్యిందో ఏమోగానీ.. తాగి పడేసిన సిగరేట్ పీకలను పీల్చుతూ కెమెరా చిక్కింది..పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్..అని గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కంలో గిరీశం డైలాగ్ ఎక్కడైన విన్నదేమో.. ఠీవీగా సిగరెట్ తాగుతూ ఫోజు కొట్టింది.. ఎండ్రకాయ వేషాలు చూసి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.