బీహెచ్ఈఎల్​ రూట్​లో ఆక్రమణల తొలగింపు

బీహెచ్ఈఎల్​ రూట్​లో ఆక్రమణల తొలగింపు

మియాపూర్, వెలుగు: మియాపూర్​మెట్రోస్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్​చౌరస్తా వరకు త్వరలో రోడ్డును విస్తరించనున్నారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను స్థానిక అధికారులు బుధవారం తొలగించారు. సర్వీస్​రోడ్డు, ఫుట్​పాత్​లపై కొనసాగుతున్న టిఫిన్​సెంటర్లు, జ్యూస్​బండ్లు, తోపుడు బండ్లను జేసీబీలతో తొలగించారు. భారీ పోలీస్​బందోబస్త్​మధ్య చందానగర్​టౌన్​ప్లానింగ్​ఏసీపీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తొలగింపు చేపట్టారు.  

అయితే, టిఫిన్​సెంటర్లు, జ్యూస్​ బండ్లను తీసుకువెళ్లేందుకు కూడా సమయం ఇవ్వలేదని చిరువ్యాపారులు వాపోయారు. మరో రెండు రోజులపాటు రోడ్డు ఆక్రమణల తొలగింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.