- కామారెడ్డిలో హైటెన్షన్!
- బూత్ విజిట్ కు రేవంత్
- బీఆర్ఎస్ శ్రేణుల అడ్డగింత
కామారెడ్డి : పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని ఓ బూత్ ను సందర్శించేందుకు వెళ్లిన పీసీసీ చీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల హోరా హోరీ నినాదాలతో బూత్ వద్ద హైటెన్షన్ నెలకొంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త సద్దుమణిగింది.ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 59శాతం పోలింగ్ నమోదైంది.