
ఒడిశాలోని రవుర్కెలాకు చెందిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) స్థానిక అభ్యర్థుల నుంచి 202 ట్రెయినీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
విభాగాలు: క్రిటికల్ కేర్, అడ్వాన్స్‌డ్ నర్సింగ్ ట్రెయినింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ల్యాబ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/ జీఎన్‌ఎం/ డిప్లొమా/ బీబీఏ/ ఎంబీఏ/ పీజీ డీప్లొమా ఉత్తీర్ణత. వయసు 35 ఏండ్లకు మించకూడదు. స్టైపెండ్ నెలకు రూ.7000-– రూ.15000 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.sailcareers.com వెబ్సైట్లో సంప్రదించాలి.