పెనుబల్లి, వెలుగు : మండల పరిధిలోని పులిగుండాల ప్రాజెక్ట్ కాల్వకు ఇటీవల పడిన గండిని ఇరిగేషన్ శాఖ పూడ్చకపోవడంతో స్థానిక రైతులే చందాలు వేసుకుని గురువారం గండిని పూడ్చారు. 15 రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుని అలుగు పోస్తోంది. ఈ ప్రాజెక్ట్ కింద పెనుబల్లి, కల్లూరు మండలాలలో సుమారు వెయ్యి ఎకరాలకు నీరు అందుతోంది.
అయితే ప్రాజెక్ట్ నుంచి వెళ్లే మేజర్ కాల్వకు బ్రాహ్మళ్లకుంట గ్రామం వద్ద వరద తాకిడికి పది రోజుల కింద గండి పడి నీరంతా వృథాగా పోతోంది. కానీ ఇరిగేషన్ అధికారులుపట్టించుకోవడం లేదు. దీంతో స్థానిక రైతులు అందరూ కలిసి చందాలు వేసుకొని గురువారం కాల్వ గండిని జేసీబీతో పూడ్చారు.