అవిశ్వాస తీర్మానాలతో ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నల్గొండ, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేల తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులు నారాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసిన ప్రజాప్రతినిధులే ఇప్పుడు ఎదురుదాడికి దిగుతున్నారు. సొంత పార్టీ లీడర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయోనని ఎమ్మెల్యేలు టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతున్నారు. అభివృద్ధి పనుల్లో లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు, మండల పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో జరిగే ప్రతి వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నారు. ఇకమున్సిపాలిటీల్లో అయితే పెత్తనం అంతా ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టి చైర్మన్లు అలంకారప్రాయంగా మారారు. మండలాలు, మున్సిపాలిటీలకు కేటాయించిన నిధుల్లో తమకు వచ్చిన వాటాలు.. తాము ఎన్నికయ్యేందుకు పెట్టిన ఖర్చులతో పోలిస్తే ఏ మూలకూ సరిపోవడం లేదన్న అభిప్రాయం నెలకొంది. నిధుల కోసం, మండలాలు, మున్సిపాలిటీల్లో తమకు దక్కాల్సిన ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో ఎప్పటికప్పుడు ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూనే ఉన్నారు. డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎమ్మెల్యేలను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోయినా, పరోక్షంగా ఆఫీసర్లపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేల వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు కనిపించకపోగా, ఇరువర్గాల మధ్య గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత పెరిగింది. రెండు, మూడేళ్ల నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలన్న లక్ష్యంతో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఏకతాటిపైకి వచ్చి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

అవిశ్వాస తీర్మానాలతో హెచ్చరికలు

మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్లపైన అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టొచ్చన్న ఆలోచనతో ఉమ్మడి జిల్లాలోని మేజర్, మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీల్లో చైర్మన్లపైన తిరుగుబాటు చేశారు. అవిశ్వాస తీర్మానాల ద్వారా ఎమ్మెల్యేల బండారాన్ని బయట పెట్టొచ్చని, తద్వారా వ్యవహారమంతా హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు వెళ్తుందని కౌన్సిలర్లు భావించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, నల్గొండ, చండూరు, నందికొండ మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టారు. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ స్థానిక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఎన్నికల టైంలో ఎమ్మెల్యేలకు తమ సత్తా ఏంటో చూపిస్తామని అవిశ్వాస తీర్మానాల రూపంలో హెచ్చరికలు చేశామని చెప్తున్నారు. 

జడ్పీ వేదికగా బయటపడ్డ విభేదాలు

ఎమ్మెల్యేల వైఖరిపై జడ్పీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపీపీలు, జడ్పీటీసీలు మండిపడ్డారు. కొందరు సభ్యులు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా ఎమ్మెల్యేలను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. శనివారం నల్గొండలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్యేలు ఎవరూ రాకపోవడంతో దాన్నే అవకాశంగా భావించిన నకిరేకల్, పెద్దవూర, తిప్పర్తి, మిర్యాలగూడ, దేవరకొండ, నాంపల్లి ఎంపీపీ, జడ్పీటీసీలు ధిక్కార స్వరం వినిపించారు. గ్రామాల్లో సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయాల్సిన పనులు కూడా ఎమ్మెల్యేలే చేయిస్తుంటే ఇక మండల వ్యవస్థ ఎందుకుని, దాన్ని రద్దు చేయాలని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లే అధికారులను నిలదీయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే పలువురు ఎంపీపీ, జడ్పీటీసీలు ప్రత్యర్థి వర్గంతో చేతులు కలుపుతున్నారు. ఎన్నికల నాటికి ఈ విభేదాలు మరింత ముదిరితే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. 

అధికారులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నడు

ఎంపీపీకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆఫీసర్లను బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే ఏది చెబితే ఆఫీసర్లు కూడా అదే చేస్తున్నారు. ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమానికి కూడా నన్ను ఆహ్వానించలేదు. టీచర్లకు ఇవ్వాల్సిన ప్రశంసాపత్రాలు కూడా ఇవ్వకుండా ఆపేసిన్రు. ఏసీబీ కేసులున్న ఎంపీడీవో లక్ష్మారెడ్డిని తక్షణమే తప్పించాలి.
- బచ్చుపల్లి శ్రీదేవి, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీపీ

ఏం జరుగుతుందో అర్ధం కావట్లే 

తిప్పర్తి మండలంలో ఏం జరుగుతుందో కనీసం సమాచారం కూడా తెలియనివ్వడం లేదు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతి గ్రామానికి కేటాయించిన రూ.20 లక్షల పనులు ఇప్పటికీ చేపట్టలేదు. వాటి వివరాలు కూడా బయటికి చెప్పడం లేదు. ప్రభుత్వం తరఫున చేపట్టే ప్రతి కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగానే జరిగిపోతోంది. నాకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు.
- రాంరెడ్డి, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్పీ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌