
కోహెడ, వెలుగు: మండలంలోని తంగాల్లపల్లిలో సోమవారం జరిగే వేణుగోపాలస్వామి కల్యాణానికి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్థానిక నాయకులు ఆహ్వానించారు. ఆదివారం మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ గౌడ్, కొమురయ్య, ముని, సంపత్ ఉన్నారు.