- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది టార్గెట్
- తుక్కగూడకు సమీపంలోని సెగ్మెంట్ల నుంచి పది వేలు
- దూర ప్రాంతాల నుంచి ఐదారు వేల తగ్గకుండా ఏర్పాట్లు
నల్గొండ, వెలుగు : హైదరాబాద్లో జరుగనున్న సోనియా గాంధీ సభను సక్సెస్ చేయడానికి స్థానిక నేతలు కుస్తీ పడుతున్నారు. ఈనెల 17న తలపెట్టిన సభకు ఉమ్మడి జిల్లా నుంచి 1.50 లక్షల మందిని తరలించాలని హైకమాండ్ ఆదేశాలిచ్చింది. నియోజకవర్గానికి పది వేల చొప్పున జన సమీకరణ చేస్తామని సీనియర్ లీడర్లు హామీ ఇచ్చారు. ఈమేరకు గురువారం గాంధీ భవన్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశం జరిగింది. పార్లమెంట్ ఇన్చార్జి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీ సీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్, కిషన్ నా యక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకాలేదని తెలిసింది. ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి 70వేల మందిని తరలించాలని నిర్ణ యించారు. సభ జరిగే తుక్కుగూడ ప్రాంతానికి దగ్గరల్లోని నియోజకవర్గాల నుంచి 10 వేలు, దూరంగా ఉన్న సెగ్మెంట్ల నుంచి ఐదారు వేల మందిని తరలించాలని నిర్ణయించారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్ మీటింగ్ శుక్రవారం జరగనుంది. సోనియా సభకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో నేతలు హైరానా పడుతున్నారు. జన సమీకరణ విషయంలో హైకమాండ్ దృష్టి పెట్టింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంత మందిని జనం తరలిస్తున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు.
అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు...
సోనియాగాంధీ సభకు జనం వెళ్లనీయకుండా బీఆర్ఎస్ లీడర్లు యత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే రోజు బీజేపీ అమిత్షా మీటింగ్ కూడా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు పెట్టిందని, ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపు తగాదాలు జన సమీకరణ మీద ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. గురువారం మీటింగ్కు సూర్యాపేట, దేవరకొండ మాజీ ఎమ్మెల్యేలతోపాటు, టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా హాజరయ్యారు.
లీడర్లను సమన్వయం చేసే బాధ్యత ఇన్చార్జిలకే..
సోనియా సభ పైనే సీనియర్లు ఫోకస్ పెట్టారు. ఎన్నికల టైంలో ఖర్చుతో కూడుకున్న పని అని కొన్ని చోట్ల ముఖ్యనేతలు ముందువెనకా ఆలోచిస్తున్నారు. కానీ టికెట్ ఆశిస్తున్న లీడర్లు మాత్రం వెనక్కి తగ్గడం లే దు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, జానారెడ్డి అనుచరులు నకిరేకల్, సూర్యాపే ట, మునుగోడు నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి పోటీగా జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి పోటీగా పటేల్ ర మేష్ రెడ్డి జన సమీకరణ పైన ఫోకస్ పెట్టారు. మునుగోడులో చల్లా కృష్ణా రెడ్డి, పాల్వాయి స్రవంతి వర్గం మధ్య పోటీ నడుస్తోంది. సోనియా సభ ద్వా రా బలప్రదర్శన చేయాలని నేతలు భావిస్తుండటంతో కేడర్లో కూడా జోష్ పెరిగింది.
18 నుంచి ప్రచార కార్యక్రమాలు...
సోనియా సభ తర్వాత ఈనెల 18 నుంచి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ ఆదేశించింది. ఈమేరకు ఎంపీ ఉత్త మ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డిలను నియోజకవర్గ ఇ న్చార్జిలుగా నియమించింది. వీళ్లతోపాటు అన్ని నియోజకవర్గాలకు కోఆ ర్డినేటర్లను నియమించింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండ, భువనగిరి, జనగామ, మునుగోడు, తుంగతుర్తి, జానారెడ్డి భువనగిరి, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ బాధ్యతలు అప్ప గించారు.