TNPL 2024: గల్లీ క్రికెట్‌ను తలపించిన తమిళ నాడు ప్రీమియర్ లీగ్.. ఏం జరిగిందంటే..?

TNPL 2024: గల్లీ క్రికెట్‌ను తలపించిన తమిళ నాడు ప్రీమియర్ లీగ్.. ఏం జరిగిందంటే..?

తమిళ నాడు ప్రీమియర్ లీగ్ లో నవ్వు తెప్పించే సంఘటన ఒకటి వైరల్ గా మారింది. సీచెమ్ మదురై పాంథర్స్ పై జరిగిన మ్యాచ్ లో  చెపాక్ సూపర్ గిల్లీస్ బ్యాటర్ కొట్టిన ఒక సిక్సర్ స్టేడియం బయట పడింది. అయితే బయట ఉన్న ఒక వ్యక్తి  బంతి తీసుకొని వెళ్ళిపోయాడు. సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఇలా జరిగినప్పుడు బయట నుంచి బంతిని స్టేడియంలోకి విసిరేస్తారు. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాత్రం బంతిని ఇవ్వడానికి నిరాకారించాడు.

ఈ వీడియో మొత్తం కెమెరాలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్స్ సెటైర్లు వేస్తూ  రకరకాల కామెంట్స్.. మీమ్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే  సీచెమ్ మదురై పాంథర్స్ 9 పరుగుల తేడాతో చెపాక్ సూపర్ గిల్లీస్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీచెమ్ మదురై పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేశ్వర్ 55 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

192 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చెపాక్ సూపర్ గిల్లీస్ 20 ఓవర్లలో 8 వికెట్లను 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ సంతోష్ కుమార్ (48), రంజన్ పాల్ (52) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ టోర్నీ విషయానికి వస్తే మొదటి క్వాలిఫైయర్‌లో లైకా కోవై కింగ్స్ తో ఐడిరీమ్ తిరుప్పర్ తమిజన్‌ తలపడుతుంది. ఎలిమినేటర్‌లో దిండిగల్‌ డ్రాగన్స్‌ తో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. టోర్నీలో రెండో క్వాలిఫయర్ (ఆగస్టు 3) .. ఫైనల్ (ఆగస్టు 4) రెండూ చెన్నైలోని ఐకానిక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతాయి.