ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్​గా భూపాలపల్లి

  • ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, వెలుగు : భూపాలపల్లి నియోజవర్గం ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్​గా మారనుందని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. శనివారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్​ బాడీ మీటింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కొడంగల్ తర్వాత భూపాలపల్లి మాత్రమే ఇంటిగ్రేటెడ్ మోడల్​గా ఎన్నికయ్యిందన్నారు.

ఘణపురం మండలం గాంధీనగర్ క్రాస్ వద్ద ఎన్నికల కోడ్ ముగియగానే కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎడ్యుకేషన్ హబ్​కు ఫౌండేషన్ సీఎం రేవంత్​రెడ్డితో వేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం తాగునీరు, రోడ్లు, చెరువుల పునరుద్ధరణ పనులపై అధికారులతో ఆరా తీశారు.

డీబీఎం 38 కాలువ లైనింగ్​ పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో  ఏఈ సతీశ్​బాబు, డీఈలు రవికుమార్, గిరిబాబు, ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ, ఎంపీడీవో వెంకటేశ్వర్​రావు, ఆర్​డబ్ల్యూఎస్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.