కుంటాల మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభం

కుంటాల మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభం

కుంటాల, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని డీఐఈ ఓ పరుశురాం అన్నారు. సోమవారం కుంటాల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని స్థానిక ఎంపీపీ గజ్జరాంతో కలిసి ప్రారంభించారు. కాలేజీ ఏర్పాటులో గ్రామస్తులు, యువకుల సహకారాన్ని ఆయన అభినందించారు.

కాలేజీలో పూర్తిస్థాయిలో సిబ్బంది, సౌకర్యాల కల్పనకు కృషి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తుకారం, జే ఎల్ అధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి, వినోద్ కుమార్, కత్తి శ్రీధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.