ఏదైనా కొనుగోలు చేసినప్పుడు గానీ.. ఏదైనా ఆన్ లైన్ పేమెంట్ చెల్లించినప్పుడుగానీ.. 2 రూపాయలో... లేదా రూపాయోఅదనంగా పోతే ఏమనుకుంటాం.. ఆ.. పోతే పోయిందిలే..2 రూపాలయలే కదా అనుకుంటాం.. కానీ చెన్నైలో ఓ మహిళ.. 50 పైసలు కోసం కోర్టుకెక్కింది. కన్స్యూమర్ ఫోరం వెళ్లి ముక్కుపిండి రూ. 15వేల జరిమానా వసూలు చేసింది. అసలు కథేంటంటే..
2023 డిసెంబర్ లో చెన్నైలోని గెరుగంబాక్కం కు చెందిన మనాషా అనే మహిళ..స్థానికంగా ఉండే ఓ పోస్టాఫీసుకు వెళ్లి రిజిస్టర్ లెటర్ పంపింది.. దీనికోసం రూ. 30 చెల్లించింది. అయితే పోస్టాఫీసు సిబ్బంది ఇచ్చిన బిల్లులో రూ.29.50 మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ సిబ్బందిని నిలదీసింది..‘‘మేడమ్ ..ఫీజు రూ. 29.50 లే అయితే రౌండ్ ఫిగర్ చేశాం’’ అని సిబ్బంది చెప్పారు. దీంతో ఆగ్రహించిన మహిళ కన్సూమర్ ఫోరం ను ఆశ్రయించింది.
ALSO READ | Post Office Schemes: పోస్టాఫీస్ స్కీమ్.. రోజుకు రూ.50 పొదుపుతో రూ.35 లక్షలు!
మనాషా ఆందోళన ఏంటంటే.. చెల్లింపుల దగ్గర రౌండ్ ఫిగర్ పేరుతో పెద్దమొత్తంలో డబ్బులు స్వాహా చేస్తున్నారని.. ప్రభుత్వానికి GST ఆదాయంలో నష్టం అని తన ఫిర్యాదులో తెలిపింది. మనాషా వాదనలు, అటు పోస్టాఫీసు సిబ్బంది వాదనలు విన్న జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పును మనాషాకు అనుకూలంగా ఇచ్చింది.
సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఓవర్‌ఛార్జ్ చేయడం, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019లోని సెక్షన్ 2(47) ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా కమిషన్ పరిగణించింది.మనాషాకు ఆమె అదనంగా చెల్లించిన 50 పైసలతోపాటు 2999900% అదనంగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దీంతో పోస్టాఫీసు మనాషాకు రూ. 15వేల జరిమానా చెల్లించింది.